03-01-2026 01:16:41 PM
మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా మహిళలకు స్పూర్తి.
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి,(విజయక్రాంతి): మహాత్మ జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి మహిళల ఆర్థిక స్వతంత్రానికి,కుల వివక్షతకు కృషి చేసిన మహనీయురాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి ఆయన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో విద్యను అభ్యసించి ఉపాధ్యాయురాలుగా సేవలు అందించారని అన్నారు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా మహిళల విద్య కోసం కృషి చేస్తూ ఎన్నో పాఠశాలలు,సామాజిక సేవలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,మహిళా ప్రతినిధి మధులత సావిత్రి బాయి పూలే సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమములో జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ పట్టణ పట్టణ కార్యదర్శి పరంజ్యోతి, చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు.