calender_icon.png 4 January, 2026 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగా గురువును సత్కరించిన కొత్తగూడెం డిఎస్పి

03-01-2026 01:09:30 PM

చుంచుపల్లి,(విజయక్రాంతి): గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో భద్రాద్రి కొత్తగూడెం యోగ విజేతగా  జిల్లా కి యోగ కి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన గుమలాపురం సత్యనారాయణ యోగ గురువుని  శనివారం కొత్తగూడెం డిఎస్పి షేక్ అబ్దుల్ రెహమాన్ శాలువాతో సత్కరించారు. మన జిల్లాలోని సమాజం అంతటికి యోగా ప్రాశస్త్యాన్ని తెలిపి ,అందరికీ ఆరోగ్యం ఆనందాలు ,సుఖ సంతోషాలు యోగ ద్వారా అందజేయాలని తెలిపినారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సి.ఐ.   కరుణాకర్  పాల్గొని అభినందనలు తెలియజేసినారు.