calender_icon.png 10 January, 2026 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవగాహనతోనే ప్రమాదాల నివారణ

09-01-2026 12:33:02 AM

మిర్యాలగూడ, జనవరి 8 (విజయక్రాంతి): రోడ్డు ప్రయాణంలో వాహన దారులు ట్రాఫిక్ సిగ్నల్ల పై అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రమాదాలు నివారణ సాధ్యమని  జిల్లా రవాణాశాఖ అధికారి లావణ్య అన్నారు. రహదారి భద్రత వారోత్సవాలలో భాగంగా గురువారం పట్టణంలోని శ్రీ మన్నారాయణ ఫంక్షన్ హాల్లో పదో తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు.

వాహనదారులు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రతి క్షణం అప్రమత్తం గా ఉండాలన్నారు. మద్యం సేవించి, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు అన్నారు. ప్రధానంగా ఓవర్ టేక్ చేస్తున్నప్పుడు రాష్ డ్రైవింగ్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు  పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే రోడ్డు సేఫ్టీ నిబంధనలు డ్రైవింగ్ రూల్స్ పై అవగాహనా పెంచుకొవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో డీటీసీ వాణి, ఎంవీఐ చంద్రశేఖర్, ఏ ఎమ్ వీఐ లు సతీష్, చిరంజీవి, గోపీనాథ్, ఎండీ అలీం, రూరల్ సీఐ పీఎండీ ప్రసాద్  , ట్రాఫిక్ ఎస్‌ఐ చల్ల శ్రీనివాస్, ఏఎస్‌ఐ బిక్షం, టీఆర్డీ ఎంఏ అధ్యక్షుడు శ్రీనివాస్, శ్యామ్ సుందర్ పాల్గొన్నారు.