calender_icon.png 28 October, 2025 | 2:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తనిఖీల లోపం వల్లే ప్రమాదాలు

26-10-2025 12:00:00 AM

ఐ ప్రసాదరావు :

కర్నూలు జిల్లా చిన్న టేకూరు జాతీ య రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదం లో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. విమానాలు, స్కూల్ బస్సులు, ట్రావెల్ బస్సులు ప్రమాదాలకు గురైన ప్పుడే ప్రభుత్వాలు, సంబంధిత శాఖలు స్పందిస్తున్నాయి. అప్పటివరకు నిద్రాణ వ్యవస్థ లో ఉంటున్న రవాణా శాఖ ఆగమేఘాలపై విస్తృత తనిఖీలు నిర్వహించడం, కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారిపోయింది.

ఇది ఏ మాత్రం శ్రేయోస్కరం కాదని గ్రహించాలి. ముఖ్యంగా ప్రైవేటు ట్రావెల్స్‌పై నిఘా, తనిఖీలు నామమాత్రంగా జరగడం వల్లే ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అసలు ట్రావెల్స్ బస్సులకు సంబంధించి సదరు రవాణా శాఖ ఆడిటింగ్ నిర్వహిస్తుందా? ఎన్ని బస్సులు మంచి కండిషన్ లో ఉన్నాయి? ఎన్ని బస్సుల్లో ఫస్ట్ ఎయి డ్ బాక్స్, కిట్, హేమర్, అగ్నిమాపక పరికరాలు, నిపుణులైన డ్రైవర్ తదితర రక్షణ పరికరాలు ఉన్నాయా లేదా అనే దానిపై తనిఖీలు జరిగాయా అన్నది ప్రశ్నార్థకమే.

ఒకవేళ తనిఖీలు చేసి ఉంటే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు నమోదు చేశారు, వాటిపై ఎలాంటి చర్య లు తీసుకున్నారనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరముంది. నిబంధ నలు పాటించని బస్సులపై ఎలాంటి చర్య లు తీసుకుంటున్నారు, ఏ సెక్షన్ కింద వాటిపై కేసులు నమోదు చేస్తున్నారు, వాటి స్టేటస్ ఏంటీ అనే అంశాలు ప్రతీ సంవత్సరం ప్రజలకు తెలిసే విధంగా ప్రభుత్వం, సంబంధిత శాఖలు ఒక డాక్యుమెంట్‌ను రిలీజు చేయాలి. 

కాసులకు కక్కుర్తి పడి

ఈ విషయాలన్నింటిని పబ్లిక్ డొమైన్ లో పెడితే ప్రయాణికులు అవగాహన చేసుకొని, మంచి ప్రమాణాలు పాటిస్తున్న బస్సులు ఎక్కి తమ గమ్యాలను సురక్షితం గా చేరుకోవడానికి వీలు ఉంటుంది.. ముఖ్యంగా పండుగ, ఇతర రద్దీ సమయాలను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు ట్రావె ల్స్ యజమానులు ఎలాంటి చెకింగ్స్ చేయకుండానే నాసిరకం బస్సులను రోడ్లపైకి తీసుకొస్తున్నారు. వీటిలో చాలా వర కు కండిషన్ లేని బస్సులే ఎక్కువగా ఉన్నాయి.

ఆయా బస్సులకు నామమాత్రంగా మరమ్మతులు చేసి రంగులు పూసి.. స్లీపర్, సెమీ స్లీపర్, లగ్జరీ వంటి పేర్లతో నడుపుతూ. అధికారుల కళ్ళు గప్పి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దొంగతనంగా తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు యాజ మాన్యాలు అధిక మొత్తంలో ఆదాయం సంపాదిస్తూ.. నాణ్యతను, నిర్దేశిత ప్రమాణాలను గాలికొదిలేస్తున్నారు. అయితే ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆర్టీసీ సర్వీసుల కంటే ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ తిప్పడానికి కారణాలు చాలానే ఉన్నాయి.

ముఖ్యంగా ఈ ప్రైవేటు ట్రావెల్స్‌లో ఎక్కువగా రాజకీయ నాయకులు, వారి బంధువులు, ధనికులు, భూస్వాములు, సంపన్నులు, కార్పోరేట్ వర్గాలకు చెందినవారివే ఉన్నాయి. దీంతో ప్రభుత్వ నిబంధ నలు బేఖాతరు చేస్తూ సంవత్సరాలు తరబడి నడుపుతూ ఆదాయాన్ని అర్జిస్తున్నా రు.

అదే సమయంలో ప్రజలు,ప్రయాణికులు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ అందిన కాడికి దోచుకుంటున్నా తమ అవసరార్థం కోసం అధిక డబ్బులు చెల్లించి ప్రయాణా లు చేస్తూనే ఉన్నారు. అయితే దీనిపై ప్రజల్లో కూడా అవగాహన పెరగాల్సిన అవసరముంది. సీజన్ బట్టి డబుల్ చార్జీ లు వసూలు చేయడం జరుగుతుంది.

డిజైన్‌లోనే లోపాలు

వాస్తవానికి శుక్రవారం ప్రమాదానికి గురైన స్లీపర్ బస్సులో డిజైన్ లోపాలు చాలానే ఉన్నాయి. స్లీపర్ బస్సుల్లో రెండు స్థాయిల్లో బెర్తులు ఉండడంతో ఎత్తు ఎక్కువగా ఉండి సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనివల్ల బస్సుకు స్థిరత్వం తగ్గి ఎక్కువ వేగంగా వెళ్లినా, అకస్మాత్తుగా బ్రేక్ వేసినా ఒకవైపుకు పడిపో యే ప్రమాదముంది. ముఖ్యంగా స్లీపర్ బస్సుల్లో లోపలి క్యాబిన్ చాలా ఇరుకుగా ఉంటుంది.

దాదాపు 30 నుంచి 36 బెర్తు లు ఉంటాయి. ఒక్కో బెర్త్ ఆరడుగుల పొడవు, 2.6 అడుగుల వెడల్పుతో ఉం టుంది. దీనివల్ల మెయిన్ డోర్ నుంచి ఒక్క వ్యక్తికి మాత్రమే నడిచేందుకు వీలుంటుంది. ఇలాంటి అగ్ని ప్రమాదాలు, యాక్సిడెంట్‌లు జరిగినప్పుడు 7 నుంచి 8 అడుగుల ఎత్తులో ఉండే ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటపడడం కూడా కష్టతరమే.

ఇక స్లీపర్ బస్సుల్లో దిండ్లు, పరుపులు, దుప్పట్లు, కర్టెన్లకు మండే స్వభావం ఎక్కు వ. మంటలు చెలరేగిన కొద్ది క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించేందుకు ఇవి దోహదపడుతాయి.ఎయిర్ కండిషన్డ్ డిజైన్ వల్ల స్లీపర్ బస్సులకు కిటికీలు ఉండకపోవడంతో పొగ మొత్తం కంపార్ట్‌మెంట్‌లోకి వేగంగా నిండుతుంది. ఇన్ని సమస్యలున్న స్లీపర్ బస్సులపై ప్రభుత్వం తక్షణమే నిషేధం విధించాలి.

ప్రైవేటు పరం

విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు వంటివి ప్రజలకు నాణ్యమైన రీతిలో అందించే ఏర్పాటు చేయాలి.దురదృష్టవశాత్తూ మన దేశంలో ప్రజల అవసరాలకు సంబంధించి దాదాపు 70 శాతం ప్రైవేటీకరణ జరిగింది. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. దీనికి తోడు కనీ సం నియంత్రించే వ్యవస్థ, తనిఖీ అధికారు లు అవసరాలకు అనుగుణంగా లేకపోవడం జరుగుతుంది.

ఏ శాఖలో చూసిన ఖాళీ పోస్టులే దర్శనమిస్తున్నాయి. సిబ్బం ది కొరత, సౌకర్యాలు కొరత స్పష్టంగా కనిపిస్తుంది. అందునా ఏ రవాణా శాఖ కార్యాలయంలో చూసిన ప్రైవేటు సిబ్బందిదే హవా. ఆయా కార్యాలయాల వద్దకు వెళ్ళితే, ఆ చుట్టుపక్కల ఉండే ప్రైవేటు వ్యక్తులు యథేచ్చగా అవినీ తి దందాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం కూడా అవసరాలకు అనుగుణంగా సిబ్బంది లేక పోవడంతో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంది.

ఇకనైనా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. అవసరం మేరకు రవాణా కార్యాలయాలు, సిబ్బంది, తనిఖీ అధికారులు, ఫైర్ సేఫ్టీ అథారిటీ, నిఘా సంస్థలు, పోలీ సు పెట్రోలింగ్ వాహనాలు సమకూర్చాలి. ప్రజల కనీస సౌకర్యాలు తీర్చే వ్యవస్థలపై దృష్టి సారించాలి. ప్రభుత్వ నియమ నిబంధనలను ప్రజలు పాటించాల్సిన అవసర ముంది.

ప్రభుత్వాలు నియమ నిబంధన లు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలి. ఇలాంటి బస్సు ప్రమాదాల్లో మర ణించిన వారికి, క్షతగాత్రులకు నష్టపరిహారం చెల్లించడంతో ప్రభుత్వాలు చేతులు దులుపుకోరాదు. పోయిన ప్రాణాలను ఎలాగూ తీసుకురాలేము కాబట్టి ప్రాణానికి ఉన్న విలువను ప్రజలు గుర్తించేలా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని ఆశిద్దాం.