calender_icon.png 28 August, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

భద్రాచలం నుండి కంటి శస్త్ర చికిత్సకు బయలుదేరిన మూడవ బ్యాచ్

28-08-2025 06:46:54 PM

జెండా ఊపి ప్రారంభించిన భద్రాచలం దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి..

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలంలో ఇటీవల పుష్పగిరి ఆసుపత్రి హైదరాబాద్ వారు భద్రాచలం రెడ్ క్రాస్ మారుతి నర్సింగ్ కాలేజీ, లయన్స్ క్లబ్, వికాస్ తరంగణి ఎన్ఆర్ఐ వాసవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి చికిత్స శిబిరంలో ఎంపికైన మూడవ బ్యాచ్ చెందిన 41 మందిని గురువారం నాడు ప్రత్యేక వాహనం ద్వారా హైదరాబాద్ పంపించగా వారి వాహనాన్ని భద్రాచలం దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి(EO Rama Devi) లాంచనంగా జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ప్రాంత గిరిజనుల కోసం మారుతి నర్సింగ్ కళాశాల లయన్స్ క్లబ్ వికాస తరంగణి, స్వచ్ఛంద సంస్థలు ఉచిత శాస్త్ర చికిత్స శిబిరాన్ని నిర్వహించి పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి ద్వారా కంటిచూపు అందించడం గొప్ప విషయంగా అభివర్ణించారు. జిల్లా రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ ఎస్ఎల్ కాంతారావు మాట్లాడుతూ, మొత్తం ఈ క్యాంపు ద్వారా 600 మందిని కంకి శాస్త్ర చికిత్సలకుఎంపిక చేయగా ఇప్పటివరకు మూడు బ్యాచ్లు పంపించామని ఇంకా 12 బ్యాచిలు పంపించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్క్రాస్ కోఆర్డినేటర్ ఎస్ఎల్ కాంతారావు రెడ్ క్రాస్ నేతలు వై సూర్యనారాయణ భాను ప్రసాద్ రాజారెడ్డి సంజీవరావు ఆదినారాయణ లైన్స్ క్లబ్ అధ్యక్షులు అమల రాజశేఖర్ తదితరులు  పాల్గొన్నారు.