28-08-2025 06:43:43 PM
మత్తడి దూకి గోదావరిలోకి ప్రవహిస్తున్న నీరు
సందర్శకుల తాకిడి.. హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ మండలం మేడమ్ పల్లి గ్రామ పంచాయతీలో ఉన్న సదర్ మాట్ పురాతన ఆనకట్ట వద్ద వరద నీరు ఉధృతి జోరుగా సాగుతుంది. దీంతో సదర్ మాట్ నిండుకుండలా దర్శనమిస్తుంది. బుధవారం నుంచి జోరుగా కురుస్తున్న వర్షాలకు పై ప్రాంతాల వరద సదర్ మాట్ కు వచ్చి చేరగా నిండిన ఆనకట్ట.. పైనుంచి పొంగిపొర్లి గోదావరిలోకి నీరు ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఇది చూచేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. కాగా ఆనకట్టవైపు ప్రజలు రాకూడదని స్థానిక పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.