28-08-2025 07:07:36 PM
మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని పాత మంచిర్యాల శ్రీ రామాలయం, శివాలయం, భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో వినాయక చవితి సందర్భంగా గణనాధుడికి నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు(Former MLA Nadipelli Diwakar Rao) పాల్గొన్నారు. గణేషుడికి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వెంట మంచిర్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెంట రాజయ్య, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.