calender_icon.png 28 August, 2025 | 10:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాడాలి

28-08-2025 06:40:02 PM

వనపర్తి టౌన్: విద్యుత్ పోరాటంలో హైదరాబాద్ బషీర్బాగ్లో కార్పోన్లో మరణించిన అమరవీరుల స్ఫూర్తితో విద్యుత్ ప్రవేటీకరణ వ్యతిరేకంగా పోరాడాలని సిపిఐ నేతలు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేశ్, కార్యవర్గ సభ్యులు కళావతమ్మ శ్రీరామ్ గోపాలకృష్ణలు మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం చంద్రబాబు విద్యుత్ చార్జీల పెంపు, ప్రైవేటీకరణకు నిర్ణయించారని దానికి వ్యతిరేకంగా వామపక్షాలు ఆరు నెలలపాటు వివిధ రూపాల్లో పోరాట కార్యక్రమాలను చేపట్టాయని వారు గుర్తు చేశారు. ఆగస్టు 28, 2000 సంవత్సరంలో ప్రభుత్వ తీర్పు నిరసనగా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చి హైదరాబాద్ చేరుకున్నయన్నారు. ప్రదర్శన బషీర్బాకు చేరుకోగానే పోలీసులు జలపి రంగులు, రాళ్లు తుపాకుల కాల్పులతో దాడి చేశారన్నారు.

విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, రామకృష్ణ కాల్పుల్లో చనిపోగా ముఖ్యమైన నాయకులు వందలాదిమంది గాయపడ్డారన్నారు. పోరాటం ఫలితంగా విద్యుత్ చార్జీల పెంపు ప్రైవేటీకరణ ఆగిపోయిందన్నారు.  ఉద్యమాల భయంతో పాలక ప్రభుత్వాలు 10 ఏళ్ల పాటు చార్జీలు పెంచే ధైర్యం చేయలేదన్నారు. కేంద్రం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు వేగంగా అడుగులు వేస్తుందన్నారు. నిలువరించేందుకు నాటి పోరాట యోధుల స్ఫూర్తితో ఉద్యమాలకు సిద్ధం కావాలని కోరారు. ఎన్ఎఫ్ఐ డబ్ల్యు జిల్లా గౌరవ అధ్యక్షురాలు కళావతమ్మ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరామ్, సిపిఐ పట్టణ సహకార దర్శి గోపాలకృష్ణ, భవనిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్న కుర్మయ్య, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు పట్టణ అధ్యక్షులు జయమ్మ, కో కన్వీనర్ శిరీష, లక్ష్మీనారాయణ, రమణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.