28-08-2025 04:21:17 PM
మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరిన్ సాయి
ముత్తారం (విజయక్రాంతి): మండలంలోని ఖమ్మంపల్లి గ్రామ సమీపంలోని మానేరు నదిలో నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరిన్ సాయి(Mandal Revenue Inspector Narin Sai) తెలిపారు. గురువారం మండలానికి చెందిన ఇసుక ట్రాక్టర్ ఎలాంటి పర్మిషన్ లేకుండా మానేరు నదిలో నుంచి అక్రమంగా ఇసుక తీసుకొని వస్తుండగా, మానేరు బ్రిడ్జి వద్ద ట్రాక్టర్ ను ఆపి తనిఖీ చేయగా ట్రాక్టర్ డ్రైవర్ వద్ద ఎలాంటి పర్మిషన్ పత్రాలు లేకపోవడంతో డాక్టర్ ను ముత్తారం పోలీస్ స్టేష్ కు తరలించినట్టు ఆర్ఐ తెలిపారు. గ్రామంలో మానేరు నుంచి ఎలాంటి పర్మిషన్ పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్ ఐ హెచ్చరించారు.