calender_icon.png 28 August, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాటాదారుల అందరికీ న్యాయం చేయాలి..

28-08-2025 06:31:27 PM

కొంతమంది వ్యక్తులకు పట్టాలు ఇస్తే మరికొందరు నష్టపోతారు

మునుగోడు (విజయక్రాంతి): ప్రభుత్వ భూమిలోని 16 మంది వాటాదారులందరికీ పట్టాలు ఇస్తే న్యాయం జరుగుతుందని, కొంతమంది వ్యక్తులకు ఇచ్చే పట్టాలను ఆపాలని వాటాదారుడు బోయ లింగస్వామి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నేలపట్ల నరేష్(Tahsildar Nelapatla Naresh)కు వాటాదారుల అందరితో కలిసి మెమోరాండం అందజేసి మాట్లాడారు. కిష్టాపురం రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 232 ప్రభుత్వ భూమిలో దళిత కులంలో మొత్తం 16 భాగాలు ఉన్నవి. భూమిలో సుమారుగా గత 60 సంవత్సరాలుగా మా తాతలు, తండ్రులు చెరువు తూము నుండి వచ్చిన నీళ్ళతో పొలాలు సైద్యం చేసేవారు. ప్రస్తుతం వర్షాలు ఆశించిన అంత లేకపోవడంతో నీటి కోరత ఉండడంతో కొంతమేరకు పత్తి సాగు చేసి మిగతా భూమిని పశువుల మేతకు వినియోగించుకుంటున్నాము.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులో బాగంగా కిష్టాపురం గ్రామంలో 12/06/2025 నాడు దరఖాస్తులు చేసుకునేందుకు వెళ్లగా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమికి సంబంధించి ఏలాంటి దరఖాస్తులు తీసుకోము అని చెప్పడంతో వాటాదారులం ధరఖాస్తుని ఇవ్వలేదు. ప్రస్తుతం 238 సర్వే నెంబర్లో నందిపాటి ముత్తయ్య తండ్రి నర్సింహ్మా, బోయ మారయ్య నుండి ధరఖాస్తు తీసుకుని సర్వేయర్ విచారణ చేశారని మాకు తెలిసింది.భూమి చేస్తే దళిత వాటల ప్రకారం 16 వాటాలకు చేయాలి లేదా వారికి కూడా చేయకుండా ఉండలని అన్నారు. దళితుల వాటాను పూర్తి పరిశీలన చేసి వాటదారులు అందరికీ న్యాయం చేయాలని అన్నారు. దరఖాస్తు ఇచ్చిన వారు పిచ్చయ్య, మారయ్య,వెంకన్న ,ఎస్ మల్లయ్య ,సుక్కయ్య ,ఇస్తారి ,టి రాములు ,ఉషయ,నందిపాటి వెంకయ్య,పెద్దలు చంద్రయ్య ,గోపాల్ బి లింగయ్య ఉన్నారు.