calender_icon.png 28 August, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాటి ముగ్గురు అమరవీరుల బలిదానంతోనే... నేడు ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత విద్యుత్

28-08-2025 06:35:02 PM

- నాడు టిడిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే నామరూపం లేకుండా చేశారు

- విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలి...

- సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బండ శ్రీశైలం

మునుగోడు (విజయక్రాంతి): నాటి ముగ్గురు అమరవీరుల బలిదానాలతోనే నేడు ప్రభుత్వాలు ఉచిత విద్యుత్ అందిస్తున్నాయని, విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం(CPM District Executive Member Banda Srisailam) పిలుపునిచ్చారు. గురువారం మునుగోడు కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బషీర్బాగ్ విద్యుత్ పోరాట అమరవీరుల 25వ వర్ధంతిని ఘనంగా నిర్వహించి విద్యుత్ పోరాట మృతవీరులు విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, రామకృష్ణల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లాడారు.

రెండు దశాబ్దాలనర నాటి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ విద్యుత్ రంగాన్ని ప్రపంచ బ్యాంకు షరతుల్లో భాగంగా విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తూ రైతాంగంపై, ప్రజలపై మోపుతున్న విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉతృతమైన ఉద్యమాలు జరిగాయన్నారు. ప్రైవేటీకరణ ఆపివేయాలని, ప్రజలపై విద్యుత్ బారాలు వద్దే వద్దు అంటూ  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో ప్రజాగ్రహాన్ని చవిచూసిన ఉద్యమం విద్యుత్ పోరాటం అన్నారు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 100 రోజులపాటు ఈ విద్యుత్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం 9 వామపక్ష,కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో  జరిగిందని అన్నారు. ప్రతి గడపకు ఈ ఉద్యమం వెళ్లిందని విద్యుత్ ప్రైవేటీకరణ జరిగితే పేదలకు, రైతాంగానికి తీవ్రమైన నష్టమని గ్రహించిన ప్రజలందరూ పల్లె పల్లె  నుంచి ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారని, చలో హైదరాబాద్ కార్యక్రమంలో వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారని అన్నారు.  పాలక ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి ఆగస్టు 28 న బషీర్బాగ్ వద్ద ముగ్గురు అమరులను కాల్చి చంపిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బంద్ కు పిలిపిస్తే ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని బంద్ ను జయప్రదం చేయడం జరిగిందన్నారు.

అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా ఓడించారన్నారు. ముగ్గురు అమరవీరుల బలిదానంతో నేటికీ పాలక ప్రభుత్వాలు విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రజలందరికీ ఉచిత విద్యుత్తు అందిస్తున్నారని దీనికి కారణం విద్యుత్ పోరాట అమరుల ప్రాణ త్యాగ ఫలితమేనని అన్నారు. సమస్యలతో సతమవుతున్న ప్రజలు కదిలితే ఉద్యమం ఎలా ఉవ్వెత్తున ఎగిసిపడుతుందో చరిత్రలో నిలిచిన ఉద్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం మతోన్మాద, కార్పోరేట్ విధానాలను కొనసాగిస్తుందని, రాబోయే కాలంలో సరళీకరణ,ఆర్థిక, మతోన్మాద,కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున ఉద్యమాలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాలలో అనేక రకాల సమస్యలు పేరుకుపోయాయని స్థానిక సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా బలమైన ఉద్యమాలు నిర్మిస్తున్నామని అన్నారు.ప్రజలందరూ ఈ స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్, మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్, యాస రాణి శ్రీను, కల్వలపల్లి గ్రామ కార్యదర్శి వంటెపాక అయోధ్య, డోలు దెబ్బ వ్యవస్థాపకులు మాల్గా యాదయ్య తదితరులు ఉన్నారు.