calender_icon.png 28 August, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

28-08-2025 06:57:16 PM

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ నియోజకవర్గంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి(MLA Pocharam Srinivas Reddy) గురువారం సూచించారు. నదులు, వాగులు, బ్రిడ్జిల వద్దకు వెళ్లవద్దని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని ఆయన హెచ్చరించారు. నిజాంసాగర్ నుంచి భారీ అవుట్లో కారణంగా మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి సూచించారు.