calender_icon.png 10 January, 2026 | 11:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్

07-01-2026 12:37:25 AM

మణుగూరు, జనవరి 6, (విజయక్రాంతి): పట్టణంలోని సుందరయ్య నగర్ లో గత సంవత్సరం వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద సుమారు రూ 4.50 లక్షల విలువ చేసే 1764 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం  చేసుకు న్నారు. ఈ మేరకు వివరాలను సిఐ పాటి నాగబాబు మంగళవారం తమ కార్యాలయంలో ఏర్పాటు సమావేశంలో  మీడియాకు వెల్లడించారు. నిందితుడు అబ్దుల్ మతిన్, అలియాస్ మున్న అనే వ్యక్తి దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడని తెలిపారు.

గత నవంబర్, డిసెంబర్, నెలలో మణుగూరుతో పాటు డోర్నకల్ లో కూడా దొంగతనాలు చేశాడని, ఇతనిపై 30 కేసులు నమోదు కాగా, పిడి యాక్ట్ తో పాటు పలు కేసులలో జైలుకు వెళ్లి వచ్చిన అతడి బుద్ధి మారలేదన్నారు. మళ్లీ దొంగతనాలనే తన వృత్తిగా ఎంచుకున్నాడన్నారు. దొంగతనాలు చేసిన బంగారంను హైదరాబాద్ బొర బండలో నివాసం ఉంటున్న తన స్నేహి తురాలుకు ఇచ్చి డబ్బులను జల్సాలకు వాడుకునే వారని సీఐ వివరించారు. నిందుతుడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. దొంగతనం కేసును చేధించిన పోలీసులను మణుగూరు డిఎస్పి వంగా రవీందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో ఎస్త్స్రలు శ్రావణ్ కుమార్, నగేష్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.