07-01-2026 12:35:58 AM
ములకలపల్లి, డిసెంబర్ 6 (విజయక్రాంతి): జగన్నాధపురం గ్రామపంచాయ తీలో తాగునీటి సమస్య ఏర్పడకుండా వేసవి కంటే ముందుగానే చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ కుంజా వినోద్ తెలిపారు.ములకలపల్లి మండలం జగన్నాధపురం పంచాయతీ లోని నల్లివారిగూడెం సొసైటీ బొడ్రాయి సందులో మంగళవారం అశ్వారావుపేట శాసన సభ్యులు జారే ఆదినారాయణ ఆదేశాల మేరకు నూతనంగా తాగునీటి బోరు కోసం బోర్‌వెల్‌తో డ్రిల్లింగ్ పనులు చేశారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ ఇబ్రహీం, కాంగ్రెస్ నాయకులు అడపా నాగేశ్వరావు,కొప్పుల రాంబాబు, కాటారపు వెంకట్రావు, సున్నం నాగేష్, సోయం బోడప్ప, రామ చారి సిబ్బంది పాల్గొన్నారు.