calender_icon.png 27 September, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోక్సో కేసులో నిందితుడికి డబుల్ జీవిత ఖైదు

27-09-2025 12:31:28 AM

చిట్యాల,(విజయక్రాంతి): మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన నిందితుడికి డబుల్ జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ శుక్రవారం నల్లగొండ  ఫోక్సో కోర్ట్ శిక్ష విధించగా,  ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు. నారాయణపురం  మండలం సర్వేల్ గ్రామానికి చెందిన నిందితుడు కట్టెల సైదులు చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డగా అవమానం భరించలేక బాధితురాలు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటనపై నిందితుడిపై  తేది 13 జూన్ 2019 లో చిట్యాల పోలీస్ స్టేషన్ నందు  పోక్సో యాక్ట్ 2012 కింద కేసు నమోదు చేసి విచారణ అనంతరం కోర్టులో ఛార్జ్ సీట్ దాఖలు చేయగా శుక్రవారం  స్పెషల్ పోక్సో కోర్ట్ నిందితుడిపై నమోదైన సెక్షన్ ల ప్రకారం  దోషిగా నిర్ధారించి రెండు జీవిత ఖైదిలుగా శిక్ష, 65 వేల జరిమాన విధిస్తూ తీర్పు వెలువడించిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు.

ఈ కేసులో సరి అయిన సాక్ష్యదారాలు సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు సమర్పించి నిందితునికి శిక్ష పడే విధంగా చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సీఐలు నరేందర్, శంకర్ రెడ్డి, ఎస్సై  రాములు, అలాగే ప్రాసెక్యూషన్ కు సహకరించిన నల్గొండ డిఎస్పి  కె.శివరాం రెడ్డి, నార్కట్ పల్లి  సిఐ నాగరాజు, చిట్యాల యస్.ఐ రవి కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్  వేముల రంజిత్ కుమార్, సిడిఓ  యాదయ్య, బరోసా సెంటర్ లీగల్ ఆఫీసర్ కె.కల్పన, లైజన్ అధికారులు పి.నరేందర్, ఎన్.మల్లికార్జున్ లను జిల్లా ఎస్పీ  అభినందించారు.