16-09-2025 12:51:43 AM
-బాలికపై లైంగిక దాడి కేసులో తీర్పు
-బాధితురాలికి రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశం
చిట్యాల, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో 21 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో న్యాయస్థానం ఇన్‌చార్జి జడ్జి రోజా రమణి సంచలన తీర్పును వెల్లడించారు. అ లాగే బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. చిట్యాల మం డలం వనిపాకల గ్రామానికి చెందిన దోమల రాములు తాగిన మైకంలో 2018లో ఎనిమిదేండ్ల బాలిక టీవీ చూస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడి లైంగిక దాడి చేశాడు.
ఈ ఘటనపై బాధితురాలి తండ్రి అదే ఏడాదిన చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపించిన పోలీస్‌లు పోక్సో యాక్ట్ క్రింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఎనిమిదేండ్ల సుదీర్ఘ విచారణ అ నంతరం పోక్సో న్యా యస్థానం ఇన్‌చార్జి రోజా రమణి సోమవారం నిందితుడికి 21 సంవత్సరాల కా రాగార శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించి 30వేలు జరిమానా విధించారు.
బాధితురాలికి 10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ప్రకటించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ కేసులో ఐవోలుగా కె. భాస్కర్ రెడ్డి, డి సైదులు బాబు, కె.పాండు రంగారెడ్డి, భరోసా లీగల్ ఆఫీసర్ మామిడి కల్పన కీలకంగా వ్యవహరించారు. ఈ తీర్పు లైంగిక వేధింపులకు పాల్పడే వారికి గుణపాఠంగా మారిందని ప్రజలు పేర్కొన్నారు.