calender_icon.png 16 September, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలి

16-09-2025 12:51:06 AM

మంత్రి గడ్డం వివేక్

మంచిర్యాల, సెప్టెంబర్ 15 (విజయక్రాం తి): చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర కార్మి క, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కలెక్టర్ కుమార్ దీపక్, డిసిపి ఎగ్గడి భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్యలతో కలిసి జిల్లా అధికారులు,  చెన్నూరు నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి పనుల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, పనులు వేగవం తం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ సాగులో భాగంగా యూరియా పంపిణీ ప్రక్రియలో జాగ్రత్త వహించాలని, పట్టాదారులు, కౌలుదారులను గుర్తించి ప్రణాళిక ప్రకారం యూ రియా అందించాలని సూచించారు. వ్యవసా య సాగుకు అవసరమైనంత యూరియా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, యూ రియా పక్కదారి పట్టకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు.

ప్రజా ఆరోగ్య, మున్సిపల్ శాఖల ఇంజనీరింగ్ విభాగాల ఆధ్వ ర్యంలో అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి నీటి సరఫరా చర్యలు చేపట్టాలని తెలిపారు. నియోజకవర్గానికి మంజూరైన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, వైకుంఠదామాల ఏర్పాటు కు చర్యలు వేగవంతం చేయాలని మంత్రి కోరారు. ప్రతి ఇంటికి శుద్ధమైన త్రాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 91 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.