calender_icon.png 17 September, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకొని ఇంజినీర్లు ముందుకు సాగాలి

17-09-2025 12:44:39 AM

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

నిజామాబాద్, సెప్టెంబర్ 16 (విజయ క్రాంతి): ఇంజనీర్స్ డే ను పురస్కరించుకొని నిజామా బాద్ పాలిటెక్నిక్ కళాశాల లో పూర్వ విద్యార్థుల సంఘం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే ఘనంగా నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో గల సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమిషనర్ ఆఫ్ పోలీస్ పి సాయి చైతన్య హాజరయ్యారు. 

పూలమాలతో మోక్షగుండం విశ్వేశ్వరయ్య నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులను రిటైర్డ్ ఇంజనీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ  మోక్షగుండం విశ్వేశ్వరయ్య  మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్‌కి భారతదేశానికి చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం భారతరత్న ఇవ్వడం జరిగిందని సిపి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈశ్వరయ్య జన్మదిన జరుపుకుంటున్నాం ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో ఇది కి పునాది అని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని మీరందరూ కూడా బాగా కష్టపడి చదివి మీకు మీ తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సీపీ సాయి చైతన్య విద్యార్థులకు సూచించారు.

  కాబోయే ఇంజనీర్స్ విద్యార్థులు దేశ నికి నిర్మాతలని సిపి కొనియాడారు. కార్యక్రమానికి సభాధ్యక్షులుగాపి భారతి ప్రిన్సిపల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి తోట రాజశేఖర్ సహా అధ్యక్షుడు ఎల్వి రమణ, సంయుక్త కార్యదర్శిసత్యనారాయణ, వినోద్, మోహన్ కుమార్, బాలచందర్, బాబా శ్రీనివాస్, వై గణేష్, కళాశాల అధ్యాపకులు నాగరాజ్, నరేష్ కళాశాల అధ్యాప కులు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విశ్రాంత ఇంజనీర్లను సన్మానించడం జరిగింది. జి. గంగాధర్ డి ఈ రిటైర్డ్, పి వీరేశం ఏ డి ఈ రిటైర్డ్, రాజయ్య విశ్రాంత డిప్యూటీ ఈ పంచాయతీ రాజ్ ,రమణ విశ్రాంత డి ఈ ఆర్& బి.వై గణేష్ పూర్వ విద్యార్థి మాస్టర్ అథ్లెటిక్ రాష్ట్రస్థాయిలో జాతీయ స్థాయిలో గోల్ మెడల్ సాధించినందుకు సన్మానించడం జరిగింది. పాలిటెక్నిక్ కళాశాల టాపర్స్ విద్యార్థులు ఆరుగురికి గోల్ మెడల్ సర్టిఫికెట్ పేమెంటు

బిగాల కృష్ణమూర్తి ట్రస్ట్ నుండి పదివేల రూపాయలు చెక్కు సర్టిఫికెట్ తో విద్యార్థులకు బహుకరించడం జరిగింది, ఏ కైవల్య, బి జాహ్నవి, కె.నెక్సన్, జే రేణు . శృతి ,ఎన్ దాక్షాయిని పాటిల్, అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే కూడా చెప్పుకున్నారు. విద్యార్థులకు గత సంవత్సరం విద్యాభ్యాసం పూర్తయిన విద్యార్థులకు  టికెట్లు అందించారు.