16-09-2025 11:45:40 PM
పెన్ పహాడ్: ఈ సెప్టెంబర్ 17న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జివివి ఫంక్షన్ హాల్ లో 'తెలంగాణ సాయుధ పోరాటం- వాస్తవాలు- వక్రీకరణలు' అనే అంశంపై తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట జరిగే సెమినార్ ను విజయవంతం చేయాలని సిపిఎం సీనియర్ నాయకుడు, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ కోరారు. మంగళవారం అనంతారం గ్రామంలో వివిధ రంగాల కార్మికులతో కడపత్ర ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ... నైజాం నవాబ్ నిరంకుశంత్వానికి వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ నుండి విముక్తి కోసం 1946 నుండి 1951 వరకు చారిత్రాత్మకమైన పోరాటం కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిందని అన్నారు.
నైజాం నవాబ్ అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడిన ఘట్టాలు చరిత్రలో నిలిచిపోయాయన్నారు. రైతులు పండించిన నిజాం ప్రభుత్వం రైతుల పంటలను పన్నుల రూపంలో దోచుకునే వారని అన్నారు. భారత సైన్యాలు నిజాం రాజును లొంగదిసుకున్నారని, తెలంగాణ రైతంగా సాయుధ పోరాట చరిత్రను హిందూ, ముస్లింల పోరాటంగా బీజేపీ చెప్పుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ప్రజలు గ్రామాల్లో సంఘం ఏర్పాటు చేసుకుని ప్రజలను చైతన్యం చేస్తూ ముందుకు సాగినరాని అన్నారు.రైతుల పంటలకు కజేయాలనే నైజాం నవాబ్ కుట్రలకు వ్యతిరేకంగా ప్రజలు విరోచతంగా పోరాడినరాని అన్నారు.
దొడ్డి కొమురయ్య అమరత్వంతో హైదరాబాద్ సంస్థణంలో ప్రజలు సాయుధ పోరాటాన్ని ఉదృతం చేసారన్నారు. తెలంగాణ రైతంగా సాయుధా పోరాటం ఫలితంగా 10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచిందని అన్నారు. వెట్టిచ్చాకిరికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర పుట్టలో ఉందన్నారు. దీంతో వడ్డీ రేట్లు తగ్గించారాని, అడవులపై గిరిజనులకు పూర్తి హక్కులు వచ్చినాయన్నారు. నేడు తెలంగాణ రైతంగా సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి ప్రజల ఐక్యతను విచ్చిన్నం చేయడానికి బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని ఆయన అన్నారు. జరగబోయే సెమినార్ కు ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీ సిపిఎం జాతీయ నాయకురాలు బృందాకరత్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, హాజరవుతున్నారన్నారు.