calender_icon.png 27 July, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజీ టూ పీజీ పాఠశాల ఆవరణలో ఆచార్య జయశంకర్ విగ్రహ ఏర్పాటు

26-07-2025 07:12:43 PM

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఆచార్య జయశంకర్ విగ్రహ ఏర్పాటుపై స్టాట్యూ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ

రాజన్నసిరిసిల్ల,(విజయక్రాంతి): గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ టూ పీజీ పాఠశాల ఆవరణలో ఆచార్య జయశంకర్ విగ్రహ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం లో ఆచార్య జయశంకర్ విగ్రహ ఏర్పాటు పై నిర్వహించిన స్టాట్యూ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ జిల్లా ఎస్పీ మహేష్ బిగితేతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్  ఝూ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో ఆచార్య జయశంకర్ చిత్రపటం ఉందని, అవకాశం ఉన్నచోట విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

గంభీర్ రావు పేట మండలం నమాజ్ చెరువు వద్ద ఆచార్య కొత్తపల్లి జయ శంకర్ విగ్రహ ఏర్పాటు గురించి చర్చించి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చెరువు ఎఫ్.టి.ఎల్ లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేనందున జయశంకర్ విగ్రహం ఏర్పాటు కుదరదని కలెక్టర్ తెలిపారు.స్టాట్యూ కమిటీ సభ్యులు అంగీకారం మేరకు గంభీరావు పేట మండలంలో ఉన్న కేజీ టూ పీజీ పాఠశాల ఆవరణలో ఆచార్య జయశంకర్ విగ్రహ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు, దీనికి సంబంధించి అవసరమైన తదుపరి చర్యలను రోడ్లు భవనాల శాఖ అధికారులు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.