calender_icon.png 11 September, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ పహార మధ్య యూరియా పంపిణీ

11-09-2025 12:23:47 AM

ఖానాపూర్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో యూరియా కోసం రైతులు బుధవారం బారులు తీరారు. జిల్లా లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు యూరియా వచ్చిందన్న సమాచారం తో జిల్లాలోని లోకేశ్వరం కడెం ఖానాపూర్ ముందు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి యూరియా బ్యాగుల కోసం కోసం క్యూలై న్లు కట్టవలసి వచ్చింది. ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క బ్యాగు పోలీస్ బందోబస్తు మధ్య పంపిణీ చేసినట్టు రైతులు పేర్కొంటున్నారు.

రైతులకు ఇబ్బంది కలుగకుండా యూరియా పంపిణీ

-దండేపల్లి, సెప్టెంబర్ 10: ప్రతి రోజు యూరియా కోసం రైతులు సొసైటీల వద్ద వందల సంఖ్యలో రైతులు నిలబడి ఉన్న, పాసుబుక్కులు, ఆథార్ కార్డులు, చెప్పులను వరుసలో ఉన్న దృశ్యాలే దర్శనమిస్తుంటా యి. కానీ దండేపల్లి మండలంలో రైతులు యూరియా కోసం వచ్చి ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో మండల వ్యవసాయాధికారి గొర్ల అంజిత్ కుమార్ వారికి అన్ని సౌకర్యాలు కల్పించారు.

దండేపల్లి, నెల్కి వెంకటాపూర్ పీఏసీఎస్ ల వద్ద యూరియా కోసం వచ్చిన రైతులకు ఇబ్బంది కలుగకుండా టెంట్ వేయించి, రైతులు కూర్చునేందుకు సరిపడా కుర్చీలు ఏర్పాటు చేశారు. కూర్చున్న రైతులకు నాను యూరియా వాడకం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. అలాగే వర్షా ల కారణంగా పంటలకు జరిగే నష్టం, నివారణ చర్యల గురించి అవగాహన కల్పిం చారు.

మరోవైపు యూరియా కోసం వచ్చిన రైతులందరు కుర్చీలలో కూర్చొని ఈ పాస్ మిషన్‌లో ఆధార్ ఎంట్రీ చేయించుకొని యూరియా ఇంటికి తీసుకువెళ్లేలా వసతులు కల్పించడంతో రైతులు మండల వ్యవసాయాధికారిని మెచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ వారం రోజుల్లో మండలానికి కావాల్సిన ఎరువులు రానున్నాయని, జిల్లాధికారులు అన్ని ఏర్పా ట్లు చేశారని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతు వేదికల వద్దకు, సొసై టీ కార్యాలయాల వద్దకు వచ్చి ఎరువులు తీసుకువెళ్లాలని కోరారు.