09-12-2025 02:17:54 AM
నేడు కలెక్టరేట్లలో కార్యక్రమాలు
హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల వేడుకల్లో భాగంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏ ర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేర కు మంగళవారం ఉదయం 10 గంటలకు అన్ని కలెక్టరేట్లలో విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్సవాలను ఘనం గా నిర్వహించాలని, సజావుగా సాగే లా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే ములుగు, నారాయణ పేట, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో విగ్రహావిష్కర ణ ఉండదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత ఏడాది ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ సచివాల యంలో ఆవరణలో సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అన్ని కలెక్టరేట్ల వద్ద కూడా ఏర్పాటు చేస్తామని అప్పుడే ప్రకటించారు.