calender_icon.png 19 May, 2025 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట్‌లో ర్యాంకు సాధించడం అభినందనీయం

19-05-2025 12:45:22 AM

బిఆర్‌ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

కుత్బుల్లాపూర్, మే 18(విజయ క్రాంతి):యాసీనా భాను నీట్ లో ర్యాంకు సాధించడం అభినందనీయమని  బిఆర్‌ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ అన్నారు.నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి మధురానగర్లో నిర్వహించిన యాసీనా భాను అభినందన సభ కార్యక్రమానికి బిఆర్‌ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 2025 నీట్ ఎస్ ఎస్ పరీక్షలో జాతీయస్థాయిలో 11 వ ర్యాంకు సాధించిన యాసీనా భానును శాలువాతో  సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2025 నీట్ ఎస్ ఎస్ పరీక్షలో జాతీయస్థాయిలో 11 వ ర్యాంకు సాధించిన యాసీనా భాను రానున్న రోజుల్లో వైద్య వృత్తిలో మరింత ఉజ్వల భవిష్యత్తు ను రూపొందించుకుని, మరింత మంది వైద్యులను తయారు చేసేందుకు తన తోడ్పాటును అందించాలన్నారు.

కూతురును డాక్టర్ గా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషిచేసిన వారి తలిదండ్రులు డాక్టర్ రషీద్, నర్జీన్ లను ఎమ్మెల్యే అభినందించారు.  అనంతరం కాలనీలో నిర్మిస్తున్నటువంటి అష్టలక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో నిజాంపేట్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ రాఘవేంద్ర రావు, నాయకులు సాంబశివ రెడ్డి, బొబ్బా శ్రీనివాస్, సతీష్ రెడ్డి, మహమ్మద్ సలీం, కాలనీవాసులు హేమంత రావు, మద్దయ్య, విష్ణువర్ధన్ రావు, రాంబాబు, వెంకయ్య, నాగేశ్వర్ రావు,కోటి రెడ్డి,మురళి,నవీన్, సుకవాసి శ్రీనివాస్,భరత్,అప్పాల రాజు,భాష,గంగాధర్, శ్రీలక్ష్మి, సుమిత్ర  తదితరులు పాల్గొన్నారు.