calender_icon.png 19 May, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

8న పసుమర్తి ప్రమాణస్వీకారం

19-05-2025 12:46:43 AM

ముఖ్య అధితిగా  ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు

ఆర్యవైశ్య సోదరుల ఆత్మీయ సమ్మేళనం

కల్లూరు మే18(విజయ క్రాంతి)పట్టణ పరిధి హిమాలయ రెస్టారెంట్లో ఆదివారం కల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల ఆర్యవైశ్య సోదరుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా కల్లూరు పట్టణ ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పసుమర్తి చందర్రావు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా జూన్ 8న కల్లూరు పట్టణంలో నిర్వహించు ప్రమాణ స్వీకారానికి ఖరారు చేశారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ  హాజరవుతున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆత్మీయ సమ్మేళనంలో పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో కల్లూరు డివిజన్ పరిధిలోని ఆరు మండలాల ఆర్యవైశ్య మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, కార్యదర్శులు, ఆర్యవైశ్య సోదరులు తదితరులు పాల్గొన్నారు.