calender_icon.png 7 November, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.4 కోట్ల విలువ చేసే భూమి విరాళం

07-11-2025 01:20:40 AM

ప్రభుత్వానికి రాసిచ్చిన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి 

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి) : రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి రూ. 4 కోట్ల విలువ చేసి 2 వేల గజాల తన సొంత భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. గురువారం ఇబ్రాహీపట్నం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారికంగా వ్యవసాయ శాఖకు కోదండరెడ్డి రిజిస్ట్రేషన్ చేశారు. తన సొంత గ్రామం యాచారంలోని 2 వేల గజా ల స్థలం, అందులో ఉన్న భవనాన్ని వ్యవసాయ శాఖకు రాసిస్తానని రెండు నెలల క్రితమే కోదండరెడ్డి ప్రకటించారు.

యా చారం మండలంలోని రైతులు పండించే పం ట ఉత్పత్తుల నిల్వ, ఇతర వ్యవసాయ పరికరాలు, పనిముట్లు పెట్టుకోవడానికి తగిన స్థలం లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోదండరెడ్డి తెలిపారు. ఇదే విష యాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వివరించారు. ఏ చిన్న పదవి కాని, ఇతర అవకాశాలు వస్తే అందినకాడికి దండుకునే రోజుల్లో.. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తన సొంత భూ మిని ప్రభుత్వానికి రాసివ్వడం గొప్ప నిర్ణయమని పలువురు అభినందించారు.