calender_icon.png 14 October, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణాలను కాపాడడానికి చర్యలు చేపట్టాలి

14-10-2025 12:51:54 AM

కలెక్టర్ హనుమంతరావు 

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 13 ( విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలలో విలువైన ప్రాణాలను కాపాడటానికి, పకడ్బందీగా   చర్యలు  చేపట్టాలని  యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో రోడ్డు భద్రత పై జిల్లా స్థాయి అధికారులతో సమన్వయ  సమీక్షా సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా  కలెక్టర్  మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో రహదారి భద్రతా చర్యలు కీలకమైనవని అన్నారు. ఈ చర్యలను తీసుకోవడంలో అన్ని శాఖల మధ్య సమన్వయం అవసరమని, ప్రతి శాఖ సమిష్టిగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని  సూచించారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్లు) గుర్తించి ప్రమాదాలను నివారించేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలన్నారు.

నేషనల్ హైవే మీద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.  ప్రధాన రహదారులపై ప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేసిన ఇప్పటివరకు అమలు కాకపోతే ఎన్ హె ఎ ఐ అధికారుల పై వ్యక్తం చేశారు.ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉన్నచోట్ల ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. మానవ తప్పిదాలు,  వాహనాలు, అత్యధిక వేగం వలన రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయన్నారు.  రోడ్లపై రుంబుల్ స్ట్రిప్స్, స్టడ్స్, సూచిక బోర్డులు, బ్లింకర్స్ వంటి రహదారి సూచనలు ఏర్పాటు చేయాలని సూచించారు.  రహదారి ఇరువైపులా పెద్దగా ఉన్న చెట్లను తొలగించాలన్నారు.

పెద్ద చెట్ల వలన లైటింగ్ కనిపించకుండా ఉంటుందన్నారు.ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అన్ని శాఖల మధ్య సమన్వయంతో జిల్లాల్లో  రోడ్డు ప్రమాదాలు   సంభవించకుండ పటిష్టంగా ఏర్పాట్లు చేయాలన్నారు.  అధిక వేగం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వేగ పరిమితిని ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. జిల్లా లో ధర్మోజి గూడెం క్రాస్ రోడ్డు, కొయ్యలగూడెం బస్సు స్టాప్, వలిగొండ ఎక్స్ రోడ్, అనంతారం  బ్రిడ్జి, మోత్కూర్ పాటిమట్టల ఎక్స్ రోడ్ వంటి ప్రదేశాలలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయని, అక్కడ సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.

 డీసీపీ  ఆకాంక్ష యాదవ్  మాట్లాడుతూ ఎక్కువగా ప్రమాదాలు జరిగే స్పాట్స్ ని గుర్తించాలన్నారు. రోడ్డులు   సరిగా లేని చోట్ల, వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. ఎక్కువగా ప్రమాదాలు జరిగే చోట సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఏసీబీ లక్ష్మీనారాయణ,  ట్రాఫిక్ ఏసిపి ప్రభాకర్ రెడ్డి, జిల్లా రోడ్లు భవనాల అధికారి సరిత, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామరాజు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.