calender_icon.png 14 October, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్

14-10-2025 12:52:56 AM

  1. టెండర్ దక్కని వారికి డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరిన పిటిషనర్
  2. జారీ చేసిన జీవోను కొట్టివేయాలని వినతి
  3. ఎక్సైజ్ శాఖ కమిషనర్‌కు నోటీసులిచ్చిన ఉన్నత న్యాయస్థానం
  4. విచారణను రెండు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు

హైదరాబాద్, అక్టోబర్ 13(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో నూతన మద్యం విధానంపై రాష్ట్ర హైకోర్టులో సోమవారం ఒక పిటిషన్ దాఖలైంది. మద్యం దుకాణాల కోసం టెండర్ దాఖలు చేసినప్పుడు చెల్లించిన మొత్తం ఆబ్కారీ శాఖకే వెళుతుందని, టెండర్ పొందని వారికి ఆ డబ్బు తిరిగి వచ్చేలా ఆదేశించాలని కోరుతూ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు.ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల  రుసుముగా నిర్ణయించారని పిటిషన్‌లో పేర్కొన్నాడు.

ఒకవేళ లాటరీలో మద్యం షాపు దక్కకపోతే ఆ మొత్తం అబ్కారీ శాఖకే వెళ్తాయని, ఆ డబ్బును తిరిగిచ్చేలా ఆదేశించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశాడు. అలాగే లిక్కర్ పాలసీపై జారీ చేసిన జీవోను కూడా కొట్టివేయాలని కోరాడు. ఈ పిటిషన్‌కు స్పందించిన ఉన్నత న్యాయస్థానం ఎక్సైజ్ శాఖ కమిషనర్‌కు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.