calender_icon.png 20 December, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

బెట్టింగ్, గంజాయిపై చర్యలు తీసుకోవాలి

11-12-2025 12:00:00 AM

వనపర్తి జిల్లాలో గంజాయి, బెట్టింగులు, ఆర్థిక నేరాలపై అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. గంజాయి, బెట్టింగులకు అలవాటైన వారు చెడు పనులు చేయడం, కుటుంబాల్లో గొడవలు చేసి ఇబ్బందులు పెట్టడం, బైకులపై వేగంగా వెళ్లి ఎదురుగా వచ్చే వాహనాలను ఢీ కొట్టడం, ప్రశ్నిస్తే దాడులు చేయడం అలవాటుగా మారిపోయింది. అదే విదంగా సులభంగా డబ్బులు పొందే క్రమంలో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు.

బంధువులను, మిత్రులను మోసం చేస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడడంలో సైబర్ నేరగాళ్లు ముందు వరుసలో ఉంటున్నారు. గంజాయి, ఆర్థిక నేరం, చిట్టీలు నిర్వహించి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసే వారి జాబితాను సేకరించి రౌడీ చార్జీషీట్ దాఖలు చేసినట్లే.. గంజాయి, ఆర్థిక నేరం, చిట్టీల చీటర్స్ షీట్ ఓపెన్ చేయాలని ప్రజలు భావిస్తున్నారు.

జిల్లాలో ప్లాట్లు, భూములను డబుల్ రిజిస్ట్రేషన్ చేసి జైలుకు వెళ్లిన వారి ఆస్తులు, వివిధ క్రిమినల్ కేసుల్లో విచారణ కోసం కోర్టులకు వెళ్తున్న నిందితుల ఆస్తులను జప్తు చేయడానికి జిల్లా కలెక్టర్/ఆర్డీవో ద్వారా రిజిస్ట్రేషన్ శాఖకు సిఫార్సు చేయాలని ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.

 బాలకృష్ణ, వనపర్తి