calender_icon.png 2 July, 2025 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

02-07-2025 12:19:23 AM

కామారెడ్డి, జూలై 1(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో నారాయణ విద్యాసంస్థను తొలగించాలని అధిక ఫీజులు వసూలు చేస్తున్న  విద్యాసంస్థ పైన విద్యాశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్  చర్య తీసుకోవాలనికోరారు. ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో వర్షంలో సైతం గంట పాటు నారాయణ విద్య సంస్థ ముందు మంగళవారం ధర్నా నిర్వహిం చారు.

ఏఐఎస్‌ఎఫ్ నాయకులు మాట్లాడుతూ ,నారాయణ విద్యాసంస్థకు ఎలాంటి అనుమతులు లేకుండా గత సంవత్సరం నుండి ఫిబ్రవరి నుండి ప్రచారం చేస్తున్న విద్యాశాఖ అధికారులు అనుమతులేదని పేపరు కు తెలియజేసిన నారాయణ విద్యాసంస్థ వారు ఇష్ట రాజ్యాంగ ఎలాంటి సౌకర్యం లేని ఆట స్థలము , తల్లిదండ్రులకు వెళ్లడానికి దారి లేనటువంటి ఇరుకైన రోడ్డు ముందు బాగాన హైవే రోడ్డు స్టేషన్ ఉండగా విద్యాశాఖ అధికారులు ఇలా అనుమతించారని వారన్నారు.

కామారెడ్డి జిల్లా రైతులు, బీడీ కార్మికులు, మధ్యతరగతి నిరుపేద జిల్లా అని వారి తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి లక్ష రూపాయలు దోపిడీ చేస్తున్న నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని లేకుంటే భవిష్యత్తులో జరిగే ఉద్యమానికి స్థానిక డీఈఓ , స్థానిక ఎంఈఓ , బాధ్యత వయల్సిందిగా ఏఐఎస్‌ఎఫ్ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్  దృష్టి పెట్టి స్టేషన్ రోడ్డు ఉన్నందున పిల్లలకు ఇబ్బంది కలిగి పరిస్థితి ఉన్నందున వారిపై చర్య తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం.

లేకుంటే నారాయణ విద్యాసంస్థ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో జరిగే ఉద్యమానికి యజమాన్యం బాధ్యత వహించాలని వారన్నారు. ఈ భారీ ధర్నా కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ కామారెడ్డి జిల్లా కన్వీనర్ పి శివప్రసాద్  ,జిల్లా నాయకులు ,ఎల్ సంపత్ కుమార్ ,పి జస్వంత్ ,సనత్ రాజు, ప్రవీణ్ ,నరేష్ నాయకులు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు