02-07-2025 12:17:54 AM
మేడ్చల్‌లో తప్పిన ప్రమాదం
మేడ్చల్ అర్బన్, జూలై 1 (విజయక్రాంతి): మేడ్చల్ పట్టణ పరిధిలోని పారిశ్రామికవా డలో మంగళవారం పెను ప్రమాదం తప్పిం ది. పాశమైలారం ఘటన తరహాలోనే ఆల్కలాయిడ్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. షాపూర్‌కు చెందిన గన్నారం శ్రీనివాస్‌రెడ్డి 12 సంవత్సరాలుగా ఆల్కలాయిడ్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు.
మంగ ళవారం ఉదయం శ్రీనివాస్‌రెడ్డి పనిచేస్తున్న సమీపంలో ఉన్న బాయిలర్ ఒక్కసారిగా పేలడం తో ఆయనకు గాయాలై అచేతన స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే శ్రీనివాస్‌రెడ్డిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. శ్రీనివాస్‌రెడ్డి వైద్య ఖర్చు లు యాజమాన్యమే భరించాలని కుటుంబీకులు డిమాండ్ చేశారు.
కాగా యాజమాన్యం నిర్ల క్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపించారు. యాజమా న్యంపై చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేవారు. ఈ ఘటన జరిగిన సమయంలో పరిశ్రమలో సుమారు 50 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పేలుడు నుంచి వారంతా సురక్షితంగా బయటపడ్డారు.