17-09-2025 02:23:56 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 16 (విజయకాంతి): అంతర్జాతీయ వైద్య సేవలను నగరవాసులకు మరింత చేరువ చేస్తూ, ప్రముఖ హెల్త్‌కేర్ బ్రాండ్ మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్‌లో తన నూతన ఆసుప త్రిని ప్రారంభించింది. 300 పడకల సామర్థ్యంతో, అత్యాధునిక సదుపాయాలతో కూ డిన ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంగళవారం కేంద్ర మంత్రులు జి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ లాంఛనంగా ప్రారంభించారు.
నాణ్యమైన వైద్యం అందించాలి: కేంద్ర కిషన్‌రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలందరికీ ప్రాథమిక వైద్యం నుంచి అత్యాధునిక చికిత్సల వరకు సమానంగా అందించాలనే లక్ష్యంతో మెడికవర్ ఈ నూ తన ఆసుపత్రిని ప్రారంభించడం అభినందనీయం అన్నారు. అంతర్జాతీయ ప్రమా ణాలతో కూడిన ఈ ఆసుపత్రి రోగులకు నాణ్యమైన చికిత్స అందించాలని ఆయన అన్నారు.
అంతర్జాతీయ స్థాయి వైద్యం: బండి సంజయ్
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ.. సాధారణ ప్రజలకు కూడా అంతర్జాతీయ స్థాయి వైద్యం అందుబాటులోకి తేవడం గొప్ప విషయం అన్నారు. మెడికవర్ వైద్యులు సేవా దృక్పథంతో పనిచేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారని ఆశిస్తున్నాను అని చెప్పారు.
ఆరోగ్య తెలంగాణకు మరో మైలురాయి: పొన్నం
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆరోగ్య రంగం అభివృద్ధి చెందితేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. ఈ ఆసుపత్రి తెలంగాణ ఆరోగ్యరంగానికి మరో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. ప్రజలకు చేరువలో ఉండే ఆసుపత్రులే నిజమైన ప్రజాసేవ చేస్తాయని పేర్కొన్నారు. ఈ నూతన కేంద్రం ద్వారా మెడికవర్ నాణ్యమైన సేవలు అందించడం అభినందనీయం అని అన్నారు.
అందుబాటు ధరలో నాణ్యమైన వైద్యం: డాక్టర్ అనిల్‌కృష్ణ
మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చైర్మన్, ఎండీ డాక్టర్ జి అనిల్ కృష్ణ మాట్లాడుతూ.. “భారతదేశంలో మా 24వ ఆసుపత్రిని సికింద్రాబాద్‌లో ప్రారంభించడం సంతోషంగా ఉంది. రోగి కేంద్రంగా, అందుబాటు ధరల్లో ఖచ్చితమైన చికిత్స అందించడమే మా లక్ష్యం. అత్యాధునిక సాంకేతికత, 40 మం దికి పైగా నిష్ణాతులైన వైద్యుల బృందంతో ఇక్కడ ప్రపంచస్థాయి సేవలు అందిస్తాం. త్వరలోనే మరిన్ని రాష్ట్రాలకు మా సేవలను విస్తరిస్తాం” అని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.