17-09-2025 02:26:01 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): ప్రజలకు పాస్‌పోరుట సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా ఒక మెట్రో స్టేషన్‌లో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కేం ద్రాన్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాద వ్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిలతో కలిసి మంగళవారం ప్రారంభించా రు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పాస్‌పోర్టు జారీలో తెలంగాణ దేశంలోనే ఐదో స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. ఆధార్ కార్డు మాదిరిగానే ప్రతి ఒక్కరికీ పాస్‌పోర్టు భారతీయు డిగా గుర్తింపు కోసం అవసరం అని ఆయన అన్నారు. రాష్ట్రంలో బేగంపేట, టోలిచౌకి, నిజామాబాద్, కరీంనగర్‌తో పాటు ఇప్పుడు ఎంజీబీఎస్‌లో ఐదో కేంద్రం అందుబాటులోకి వచ్చిందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రోజు కు 4,500 పాస్‌పోర్టులు ఇచ్చే సామర్థ్యం మనకున్నదని చెప్పారు. ఈ నూతన కేంద్రం లో స్లాట్ల సంఖ్యను 750 నుంచి 1200కు పెంచాలి అని ఆయన అధికారులకు సూచించారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడు తూ.. పాతబస్తీ ప్రజలకు అందుబాటులో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికీ పాస్పోర్ట్ అవసరమవుతున్న ఈ తరు ణంలో, ఈ కేంద్రం ఏర్పాటుతో ఆ ప్రక్రియ మరింత సులభతరం అవుతుందన్నారు. కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ కేజీ శ్రీనివాస, రీజినల్ పాస్‌పోర్టు అధికారిణి జె స్నేహజారెడ్డి, కలెక్టర్ హరిచందన దాసరి తదితరులు పాల్గొన్నారు.