22-08-2025 02:23:51 AM
ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు వినతి
ముషీరాబాద్, ఆగస్టు 21(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాల్లో మాలలపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్న మార్వాడీల పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ మందాల భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేరా బాలకిషన్(బాలన్న) లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల శివారు ప్రాంతాల్లో ‘మాలల‘పై దాడులు చేస్తూ దౌర్జన్యాలకు దిగుతూ కులం పేరుతో దూషిస్తున్న మార్వాడీల పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి వినతి పత్రాన్ని అందజేసినట్లు వారు వెల్లడించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం సికింద్రాబాద్ మోండా మార్కెట్ సమీపంలో ఉన్న ఎస్ కే జ్యువెలర్స్ వద్ద సాయి కుమార్ అనే వ్యక్తిపై ఆ కారణంగా దాడిచేసి, కులం పేరుతో దూషించి, దౌర్జన్యాలు చేసిన మా ర్వాడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞ ప్తి చేసినట్లు తెలిపారు.
దోషులను వెంటనే అరెస్టు చేయాలని, లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ నగరం బందుకు పిలుపుని స్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ నాయకులు డాక్టర్ వీరస్వామి, కొప్పుల అర్జున్, గోపి సత్యనారా యణ, అరుణ్, కార్తీక్ పాల్గొన్నారు.