calender_icon.png 22 August, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాన్స్‌జెండర్లకు పోలీసుల హెచ్చరిక

22-08-2025 02:23:46 AM

మల్కాజిగిరి, ఆగస్టు 21 : నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుభకార్యాలు, గృహప్రవేశాలు, పండుగలు, వ్రతాల సందర్భాల్లో ట్రా న్స్‌జెండర్లు ప్రజలను బెదిరించి డ బ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో నేరేడ్మెట్ పోలీస్ అధికారులు గురువారం ట్రాన్స్‌జెండర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్భంగా సీఐ సందీప్ మా ట్లాడుతూ  ఎవరైనా ట్రాన్స్‌జెండర్లు బలవంతంగా డబ్బులు వసూ లు చేస్తే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.