calender_icon.png 17 October, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్ రూమ్ ఖాళీ చేయించడం ఖండిస్తున్నాం

17-10-2025 07:28:12 PM

పేదలను  గెంటేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి: సిపిఐ ఎంఎల్ మాస్ ప్రజాపంథా 

మోర్తాడ్,(విజయక్రాంతి): వరదల వల్ల డబుల్ బెడ్ రూంలలో నివాసం ఉన్న పేదల పట్ల ప్రభుత్వ అధికారులు అనుచితంగా వారి పట్ల ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు డిమాండ్ చేశారు. అక్టోబర్16 న మోర్తాడ్ మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో వర్షాల మూలంగా జరిగే ప్రమాదం భారీ నుండి దించడానికై రక్షించడానికి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూంలో నిరుపేదలు నివాసమున్న వారి పట్ల ప్రభుత్వ అధికారులు పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన ఘటనపైస్థానిక నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మోర్తాడ్ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సిపిఐ ఎంఎల్. ప్రజాపంథా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కమిటీ కార్యదర్శి.వి. ప్రభాకర్. మోర్తాడ్ మాజీ సర్పంచ్. బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ... మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రభుత్వ హయాంలో 225.. డబుల్ బెడ్ రూములు నిర్మాణం చేశారు. మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి సమక్షంలో 155 జాబితాను తయారు చేశారు. అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ జాబితాలో అనేక మార్పులు చేర్పులు అధికారులపై ఒత్తిడి తెచ్చ అర్హుల పేర్లు చేర్చినట్టు వారు ఆరోపించారు. 

ఈ నేపథ్యంలో భారీవర్షాల మూలంగా పాత ఇండ్లన్నీ శిథిలావస్థకు చేరి కూలిపోయిన నిర్వాసితులన కల్పించామన్నారు. ఈ సంఘటనలు మండల కేంద్రంలో చాలా ఉన్నాయని బేల్దారి కుటుంబానికి చెంది గోడ కూలి మరణించిన ఘటన కూడా రెవెన్యూ అధికారులకు తెలిసినప్పటికీని బలవంతంగా పేదలను డబుల్ బెడ్ రూమ్ లో నుండి ఖాళీ చేయించడం దారుణమన్నారు. ఈ నేపథ్యంలో నాగమణి కిరాయికి ఉన్న ఇల్లు  గంగవ్వ ఉన్న ఇల్లు కూడా కూలిపోయింది. చంద్రవ్వ ఇల్లు సైతం కూలిపోయింది. వర్షాల ప్రమాదం నుండి కాపాడుకోవడం కోసం ,12, కుంటుభాలు ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ లో మొదట తలదాచుకొని తర్వాత తర్వాత అక్కడే ఐదు నెలలుగా జీవనాన్నికొనసాగించారని ఈ అంశం రెవిన్యూ అధికారులందరికి కూడా తెలిసిందేనని అన్నారు. 

చట్టబద్ధంగా మేము ఇవ్వలేదు కాబట్టి ఖాళీ చేయించాలని రాజకీయ ఒత్తిడి పెరవీకారుల ఒత్తడితో నియోజకవర్గ ఇంచార్జిసునీల్ రెడ్డి  పైనఒత్తిడి పెంచారు. ఏదైతేనేమి 100% అర్హులైన పేదలకు ఏమాత్రం సమయం ఇవ్వకుండా కేవలం ఓటు బ్యాంకు కోసం ఆకస్మికంగా బలవంతంగా ఖాళీ చేయించి సామాన్లు బయట విసిరి వేయడం ఇందిరమ్మ పాలన అంటే ఈ ఇదేనా అని వారు ప్రశ్నించారు. మోర్తాడ్ గ్రామంలో అర్హులైన వారి జాబితా ప్రకారంగా  వీరికి డబుల్ బెడ్ రూమ్ కేటాయించాలని డిమాండ్ చేశారు. సునీల్ రెడ్డి విచారణ జరిపించుకొని తగు న్యాయం చేయాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని గుర్తు చేశారు. ఈ మండల పరిధిలోనే దొన్ పాల్ గ్రామంలో 96 మందికి ఇళ్ల స్థలాలు పట్టాలిచ్చి నేటికీ కబ్జా ఇవ్వకపోవడం అన్యాయమని గుర్తు చేశారు. వెంటనే వీరికి కబ్జా ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ నిర్మించి ఇవ్వాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు.