calender_icon.png 17 October, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఆర్ ఫై అందరికి అవగాహన ఉండాలి

17-10-2025 07:22:38 PM

పోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నాగేశ్వరావు

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్  గుగులోతు రవి ఆధ్వర్యంలో కార్డి యోపల్మనరీ రిసెస్సిటేషన్‌ (సీపీఆర్‌)పై  పోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నాగేశ్వరావు శుక్రవారం నాడు మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేసే సిబ్బందికి అవగాహనకల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వరావు మాట్లాడుతూ అత్య వసర పరిస్థితుల్లో ఎవరైనా స్పృహతప్పి శ్వాసతీసుకోడంలో ఇబ్బందిపడే పరిస్థితు లు ఎదురైనప్పుడు గుండె ఊపిరితిత్తుల మధ్యలో రక్తప్రసరణ సరిగా జరిపించేందుకు, మెదడుకు రక్తప్రసరణ జరిగేలా సీపీఆర్‌ దోహదపడుతుందని తెలిపారు.

ఆకస్మిక గుండెపోటు వచ్చినప్పుడు అత్యవసర వైద్య చికిత్స ద్వారా గుండె తిరిగి కొట్టుకునే వరకు సిపిఆర్, మెదడు, ఇతర అవయవాలకు ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తాన్ని ప్రవహించేలా చేస్తుంది. గుండె ఆగిపోయినప్పుడు శరీరానికి ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తము లభించదు. ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తం లేకపోవడం వల్ల కొన్ని నిమిషాలలో మెదడు దెబ్బతింటుంది. అందువల్ల సిపిఆర్ అవగాహన ప్రతి ఒక్కరికి అవసరమని, ఎలా సిపిఆర్ చేయాలో శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించారు.