calender_icon.png 18 September, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమానత్వంతోనే మహిళా సాధికారత

18-09-2025 12:19:37 AM

సుచిత్ర మొగిలి :

జనాభాలో దాదాపు సగం ఉన్న మహిళలు ఆర్థికంగా, సామాజికంగా సమాన హక్కులు, సాధికారత సాధించకుండా అభివృద్ధి అసాధ్యమన్న వాస్తవాన్ని ప్రపంచమంతా ఆమోదిస్తున్నది. కుటుంబం, దేశం ప్రగతి పథంలో పురోగమించటంలో మహిళలే కీలకమన్న విషయాన్ని గుర్తెరిగిన ప్రభుత్వాలు వారి అభివృద్ధి, సాధికారత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి.

మహిళలు లేని సమాజం ఊ హించలేము. ఇంటిని, కుటుంబాన్ని, సమాజాన్ని నిలబెట్టే శక్తి వారి లోపలే ఉంది. మహిళలు సమాజానికి మూలస్తంభాలు. కానీ వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే.. ఇంకా మహిళలకు సమాన త్వం, అవకాశాలు, గౌరవం పూర్తిగా అంద డం లేదని తెలుస్తోంది. విద్య, ఆరోగ్యం, ఉ ద్యోగాలు, నిర్ణయాధికారం అన్నింట్లో పు రోగతి ఉన్నట్లు కనిపించినా మహిళలు ఇ ప్పటికీ అనేక సమస్యలు ఎదుర్కొంటూ నే ఉన్నారు.

హక్కుల కోసం పోరాటా లు, స మానత్వానికి చేసే ప్రయత్నాలు ఇంకా పూ ర్తిగా సాధించలేదన్నది వాస్తవం. మ హిళా సాధికారత అంటే కేవలం వి ద్యను  అభ్యసించడం.. ఉద్యోగం పొంద డం మా త్రమే కాదు. నిర్ణయం తీసుకునే శక్తి, ఆర్థిక స్వావలంబన, సామాజిక గౌరవం, ఆరోగ్య సేవలు వంటి అన్ని రంగాల్లో స మానంగా ముందడుగు వేసినప్పుడే మహిళా సాధికారత సాధించినట్లవుతుంది.

దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువ మంది బా లికలు పాఠశాలల్లో ప్ర వేశాలు పొందుతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, గ్రా మీణ ప్రాంతాల్లో కూడా పాఠశాలకు వెళ్తు న్న బాలికల సంఖ్య పెరిగింది. కానీ ప్రై వేటు పాఠశాలల్లో మాత్రం దీనిలో వ్య త్యాసం కనిపిస్తుంది. దీనిని గమనిస్తే ప్రతీ కుటుంబంలో బాలికల పట్ల వివక్ష ఉందని తెలుస్తుంది.

అంతేగాక ఇంటి బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, బాల్య వివాహాలు, భ ద్రతా లోపం, సమాజంలోని వివిధ వ్యతిరేక అభిప్రాయాల వల్ల పాఠశాల విద్యను మధ్యలోనే మానేస్తున్న బాలికల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ర్ట, జాతీయ స్థాయిలో మహిళల కోసం ప్ర త్యేక పథకాలు, సూక్ష్మ ఆర్థిక సహాయ కార్యక్రమాలు అమల్లో ఉన్నాయి.

అయితే ఉ ద్యోగావకాశాల్లో మ హిళల పట్ల  ఇప్పటికీ వివక్ష ఎక్కువగానే ఉంది. మహిళలకు స రైన ఆరోగ్య సేవలు అందడం లేదు. భ ద్రతా లోపం కారణంగా స్వేచ్ఛగా పని చే యలేకపోతున్నారు. ఇం ట్లో నిర్ణయం తీ సుకునే హక్కు చాలా చోట్ల ఇంకా పరిమితంగానే ఉంది.

సమాన హక్కులు కల్పిస్తున్నా

జనాభాలో దాదాపు సగం ఉన్న మహిళలు ఆర్థికంగా, సామాజికంగా సమాన హక్కులు, సాధికారత సాధించకుండా అభివృద్ధి అసాధ్యమన్న వాస్తవాన్ని ప్రపంచ మంతా ఆమోదిస్తున్నది. కుటుంబం, దేశం ప్రగతిపథంలో పురోగమించటంలో మహిళలే కీలకమన్న విషయాన్ని గుర్తెరిగిన ప్ర భుత్వాలు వారి అభివృద్ధి, సాధికారత కో సం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నా యి. అనేక రంగాల్లో ఇప్పటికీ వివక్ష కొనసాగుతున్నప్పటికీ మహిళల రక్షణ, స్వా వలంభన కోసం అనేక చట్టాలు రూ పాంతరం చెందాయి.

భారత్‌లో కూడా రా జ్యా ంగ రక్షణలతో పాటు అనేక చట్టాలు ఉ న్నాయి.ఇటీవల కాలంలో మహిళా సాధికారతపై అర్థవంతమైన చర్చ జరుగుతుం ది. నేటి సమాజంలో మహిళా స్థితిగతులు, వారి పనితీరు, వారి హక్కులు, అమలవుతున్న చట్టాలపై ఎంతో అర్థవంతంగా, అ వగాహనతో చర్చ జరుగుతుంది. అడపాదడపా దొరుకుతున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ పురోగమిస్తున్నారు. మగ వాళ్లకు ఏమాత్రం తీసిపోమని, అన్నిరంగా ల్లో మాకు వాటా ఇవ్వాల్సిందేనని గట్టిగా నినదిస్తున్నారు.

అభద్రతా భావం

ఒకప్పటితో పోల్చితే ఉద్యోగ రంగాల్లో మహిళల సంఖ్య పెరిగింది. అయినా పనిచేసే చోట లైంగిక వేధింపులు, చులకన భా వం, పురుషాధిక్యత, అభద్రతాభావంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. స్వ యం ఉపాధి పథకాలు, శ్రామిక రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినా, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారికి సరైన వేతనం లభించడం లేదు. ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, గౌరవం లభించడం లేదు.

మహిళల ఆదాయంలో స్వంత నియంత్రణ కూడా తక్కువగా ఉంది. ఆర్థికంగా బలంగా మారితేనే ఇతర రంగాల్లో కూడా ముందడుగు వేసే అవకాశం దొరుకుతుంది. సొంత ఆదాయాన్ని పొందగలిగి నప్పటికీ, ఆ ఆదాయంపై నిర్ణయం తీసుకు నే శక్తి లేకపోతే అది ఎంతవరకు సాధికార త? మహిళలకు గర్భధారణ సమయం లో సరైన వైద్యసేవలు అందని గ్రామాలు ఇ ంకా ఉన్నాయి. సరైన పోషకాహారం లే మితో తల్లులు, శిశువులు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు.

శారీరక లోపా లు,  మానసిక ఒత్తిడి మహిళల జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆరోగ్యం లేకపోతే సా ధికారత ఎలా సాధ్యమనేది ఆలోచన చేయాలి. అంతెందుకు మహిళలు బహిరంగంగా పని చేయడం, ప్రయాణించడం, విద్య పొందే చోట్ల ఇబ్బందులు తప్పడం లేదు. లైంగిక వేధింపులు, గృహ హింస, వస్త్రాధారణ కట్టుబాట్లు వంటి సమస్యలు మహిళల స్వేచ్ఛను తగ్గిస్తున్నాయి. చట్టాలు ఉన్నా, అవగాహన లో పం వల్ల వాటిని ఉ పయోగించుకోలేకపోతున్నారు.

అవగాహన కార్యక్రమాలు

సమాజంలో మహిళలపై ఉన్న మూఢ భావాలను మార్చేందుకు అవగాహన కా ర్యక్రమాలు చేపట్టి లింగ వివక్ష రూపు మా పాలి.విద్య లభిస్తే కుటుంబం ఎదుగుతు ంది. ఆరోగ్యంగా ఉంటే దేశం బలపడుతుంది.ఉద్యోగావకాశాలు లభిస్తే ఆర్థికంగా స్వయం సమృద్ధిగా మారుతుంది. కొన్ని రంగాల్లో పురోగతి ఉన్నప్పటికీ, ఇంకా చా లానే ముందడుగు వేయాల్సి ఉంది. భ యం, అవగాహన లోపం కారణంగా చా లా మంది మహిళలు తమ హక్కులను వి నియోగించుకోలేకపోతున్నారు.

సమా జం మారాలంటే ముందుగా మన మనసులు మారాలి! విద్యకు సమాన అవకాశాలు కల్పించి ఆరోగ్య సేవలు అందుబాటులోకి తేవాలి. శిక్షణ కల్పించి సూక్ష్మ వ్యాపారాల కు రుణాసదుపాయాలు చేసినట్లయితే ఆ ర్ధికంగా బలపడతారు. అవగాహన కార్యక్రమాల ద్వారా సమాజాన్ని సున్నితంగా మార్చడం  నిర్ణయాధికార స్థానాల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పంచి వారిని ప్రో త్స హించాలి.

మహిళలకు సమాన అవకాశా లు, గౌరవం, స్వేచ్ఛ, ఆర్థిక భద్రత కలిగినప్పుడే మహిళలకు నిజమైన సాధికారత సాధ్యమవుతుంది. మహిళల అభివృద్ధి అంటే మన కుటుంబ అభివృద్ధి, మన సమాజ అభివృద్ధి అనే విషయాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ మహిళాభివృద్ధి కొర కు ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వ్యాసకర్త సెల్: 8466827166