18-09-2025 12:19:15 AM
ఉప్పల్,(విజయక్రాంతి): రోజురోజుకు స్కూల్లలో రాగి భూతం పడగలను విప్పుతుంది. మొన్న బోడుప్పల్ స్కూల్లో ర్యాగింగ్ మరవకముందే తాజాగా నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో రాగింగ్ భూతం పడగవిపింది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి పుట్టినరోజు వేడుకలు భాగంగా తోటి విద్యార్థులు ర్యాగించేసి ప్రవేట్ పార్ట్ పై కాళ్లతో తన్నినట్లు ఆ విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. ప్రవేట్ పార్ట్ మొత్తం వాచిపోయి రక్తస్రావమైనప్పటికీ విషయాన్ని సదరు ప్రిన్సిపాల్ కు తెలియజేసిన పట్టించుకోకుండా నిర్లక్ష్యం వివరించారని తల్లిదండ్రులు ఆరోపించారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సంఘటన గుట్టు తప్పుడు కాకుండా నాచారం పోలీసులు క్రైమ్ నెంబర్ 595 బై 11 9/225 ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యజమాని అక్కడ పనిచేసిన ఇంచార్జిలపై కేసు నమోదు చేశారు. తరచూ స్కూళ్లలో ర్యాగింగ్ జరుగుతున్నప్పటికీ యజమానియారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. స్కూళ్లలో ఇంతలా ర్యాగింగ్ జరుగుతున్న యజమాన్యాలు పట్టించుకోకపోవడంతో పాటు అధికారులు సైతం నిమ్మక నిరీత్ రెడ్డి వివరిస్తున్నారు కూడా ఉన్నాయి.
ఇటీవల కాలంలోనే బోడుప్పల్లో ఇదే తరహాలో ఒక స్కూల్లో విద్యార్థిపై హబ్సిగూడ లొ కాలేజీ మరొక విద్యార్థిపై కూడా ర్యాగింగ్ రాగి భూతం పడగలేపుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ యజమానుల అధికారులు వతాస్తు పలుకుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఘటనపై స్థానిక పోలీసులు యజమాని ఎమ్మెల్సీ కావడంతో విచారణ సరిగా జరగలేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాయాల పాలైన విద్యార్థి మూడు నెలలు గడిస్తే కానీ ఏ విషయమైనా చెప్పలేరు అని వైద్యులు చెబుతున్నారని గాయాలపాలైన విద్యార్థి తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు.
తమ కుమారుడికి ఏదైనా జరిగితే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యజమానిది బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఇదిలా ఉంటే స్కూల్ ఆవరణంలో కొంతమంది విద్యార్థులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడమే కాకుండా తోటి విద్యార్థులను ఇబ్బందులు గురిచేస్తున్నారని మరి కొంతమంది తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. లక్షలాది రూపాయలు చెల్లించి ఉన్నతమైన విద్య కోసం స్కూల్లో చేర్పిస్తే స్కూల్ యజమాని నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు పక్కదో పడుతున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పోరేట్ స్కూల్ కావడంతో విద్యాధికారి డి ఈ ఓ సైతం ఏ రోజు కూడా స్కూలు పర్యవేక్షించి చర్యలు తీసుకున్న దాఖలు లేవని ఇకనైనా అధికారులు యజమానులపై చర్యలు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని పలుగురు తల్లిదండ్రులు కోరుకుంటున్నారు..