calender_icon.png 18 September, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రిపుల్‌ఆర్ వద్దంటూ రైతన్నల నిరసన

18-09-2025 12:20:58 AM

మాడ్గుల, సెప్టెంబర్ 17: ట్రిపుల్ ఆర్ రోడ్డు అలైన్మెంట్ ను తక్షణమే మార్చాలని నిరసిస్తూ  బుధవారం రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం అన్నె బోయినపల్లి గేటు వద్ద సాగర్ హైవే వద్ద పలు గ్రామాల చెందిన రైతులు వివిధ పార్టీల నేతలు నిరసనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, బిజెపి, బీఆర్‌ఎస్ అఖిలపక్ష పార్టీల నేతలు రైతులకు మద్దతు పలుకుతూ  ర్యాలీలో పాల్గొన్నారు.

దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతో ఇబ్రహీంపట్నం ఏసిపి రాజు ఆధ్వర్యంలో భారీగా పోలీసులను మోహరించి ర్యాలీగా వస్తున్న రైతులను, అఖిలపక్ష నాయకులను మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను అడ్డుకున్నారు. దీంతో రైతులు అగ్రహానికి గురైన రైతులు ప్రభుత్వం, సీఎం,ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. త్రిబుల్ ఆర్ పేరిటా మా భూములు లాక్కోవద్దంటూ....

మా బతుకులను ఆగం చేయొద్దు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చడం వల్ల మండల రైతులకు తీవ్రంగా నష్టపోతున్నట్లు చెప్పారు. నిరసన కార్యక్రమంలో భాగంగా  పోలీసులకు, రైతులకు మధ్య కొంత తోపులాట చోటు చేసుకుంది . పోలీసుల ఏర్పాటుచేసిన  భారీ గేట్లను దాటి సాగర్ హైవే రోడ్డుపై రైతులు అఖిలపక్ష నేతలు  బైఠాయించారు. హైదరాబాద్ -సాగర్ హైవే పై  అర్థగంటకు పై గా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. 

మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్  మాట్లాడుతూ ప్రభుత్వం త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ను మార్చి రైతుల నోట్లో మట్టి కొట్టిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ బడా నేతల భూములను కాపాడి బక్క రైతుల  భూములను లాక్కునేలా హెచ్‌ఎండిఏ అలైన్మెంట్ విడుదల చేయడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మరొసారి పునరాలోచన చేసి రైతులకు  న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అనంతరం నిరసనకు దిగిన రైతుల తో పాటు మాజీ ఎమ్మెల్యే ను  పోలీసుల అరెస్టు చేసి  స్టేషన్ కు తరలించారు. అనంతరం సొంత పూచికతో పై విడుదల చేశారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఏమి రెడ్డి జైపాల్ రెడ్డి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీ నరసింహ్మా రెడ్డి, రెడ్డి కృష్ణారెడ్డి, జంగయ్య గౌడ్, తిరుమల్ రెడ్డి,

రాజ వర్ధన్ రెడ్డి, సంజీవరెడ్డి, రమేష్ రెడ్డి, గ్యార చంటిబాబు, గౌనిలాలయ గౌడ్, కోరుకోరు తిరుపతయ్య, యాదిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఆమనగంటి రామిరెడ్డి, నార కట్ల వెంకటయ్య, చంద్రయ్య గౌడ్, సిపిఎం నాయకులు కానుగుల వెంకటయ్య, మస్కు అంజయ్య, శివశంకర్, కుందూరు జగన్ పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.