08-05-2025 01:16:40 AM
కొత్తపల్లి, మే 7 : ఈనెల 8న మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఆయన నివాసంలో పలువురు కలిసి పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించి ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, దుర్షేడ్ మాజీ ఉపసర్పం సుంకిశాల సంపత్ రావు, నగునూరు మాజీ సర్పం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
జన్మదిన వేడుకలకు దూరం ః ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్, మే 7 (విజయక్రాంతి) : ప్రస్తుతం మన భారతదేశ సరిహద్దులలో టెర్రరిజం అంతం చేయడానికి ఆపరేషన్ సింధూర్ ద్వారా జరిగిన సైనిక చర్యకు మనం పూర్తిస్థాయిలో సైనికులకు బాసటగా నిలవవలసిన అవసరం ఉందని, వారి లక్ష్యసాధనలో వారికి మనో ధైర్యం కల్పించి విజయం చేకూరాలని ఆపద్బాంధవుడు ఏడు కొండల వేంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రకటించారు. ఈ సందర్భంలో తన జన్మదినం పురస్కరించుకొని కరీంనగర్ నియోజకవర్గంలో బారాస కార్యకర్తలు, అభిమానులు ఎటువంటి వేడుకలు నిర్వహించవద్దని కోరారు. వీలైతే రక్త శిబిరం నిర్వహించి రక్త సేకరణ చేయాలని ఎమ్మెల్యే గంగా కమలాకర్ కోరారు.