31-10-2025 01:29:58 AM
 
							సీఈవోకు బీఆర్‌ఎస్ నేతలు పల్లె రవికుమార్, కిషోర్‌గౌడ్ ఫిర్యాదు
హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి) : జూబ్ల్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్‌ఎస్ క్యాడర్‌ను వారంలో ఖతం చేస్తానని బెదిరిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఈవో సుదర్శన్‌రెడ్డికి బీఆర్‌ఎస్ నేతలు పల్లె రవికుమార్, కిషోర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు అవుతుందన్నారు.
తమకు ఎన్నికల కమిషన్ పై విశ్వా సం ఉందని, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఓట్లు రాబట్టేందుకు నేతలు బెదిరిస్తున్నారని, స్వేచ్ఛగా ఓట్లు వేసేందుకు ఎన్నికల కమిషన్ కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు నోటీస్ ఇస్తామని ఎలక్షన్ కమిషన్ సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపినట్టు చెప్పారు. తక్షణమే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను పోటీ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.