31-10-2025 01:30:03 AM
 
							ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): పత్తి పంటను పండించిన రైతులకు ప్రభుత్వ మద్దతు ధర కల్పించేందుకు సీసీ కొనుగోలను ఏర్పాటు చేసినట్లు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో కేదార్నాథ్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో సీసీఐ పత్తి కొనుగోలు కేం ద్రాలను పూజలు చేసి ప్రారంభించారు. పత్తి పంట అమ్మకంలో రైతులకు ఇబ్బందులు కలగకూడదని నిర్మల్ శాసనసభ్యులు తెలిపారు. రైతులందరికీ ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరను అందించాలని పేర్కొన్నారు.
తేమ నిర్ధారణ పారదర్శకంగా జరగాలని చెప్పారు. రైతులకు తమ పంటను అమ్మేందుకుగాను కపాస్ కిసాన్ యాప్ స్లాట్ బుకింగ్ గురించి అవగాహన కల్పిస్తూ ఉండాలని చెప్పారు. తేమశాతం లేని పంటను తీసుకువస్తే రైతులు మద్దతు ధర పొందవచ్చునని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పత్తి కొనుగోలను పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని కిషన్ క్రాప్ యాపై రైతులకు అవగాహన పెంచుతున్నామని తెలిపారు. పత్తి పంట కొనుగోలు విధానాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీ లించారు.
అంతకుముందు పత్తి పంట కొనుగోలు ప్రారంభోత్సవానికి వచ్చిన కలెక్టర్, ఎమ్మెల్యేలకు జిన్నింగ్ మిల్లు నిర్వాహకులు పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమా ర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్, వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్ పాల్గొన్నారు.