calender_icon.png 31 October, 2025 | 11:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించాలి

31-10-2025 01:28:54 AM

-నేడు నేషనల్ యూనిటీ డేను నిర్వహించాలి

-కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాం తి):  జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కు నాణ్యమైన విద్య తో పాటు మౌలిక సదుపాయాలు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ.ఎం.ఆర్.ఎస్ ప్రిన్సిపాల్స్, అధికారులతో జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఉట్నూర్, నార్నూర్, ఇంద్రవెల్లి పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. పాఠశాలల్లో సెల్ టవర్స్ ఏర్పాటు చేయడం ద్వారా డిజిటల్ క్లాసులు, ఆన్లైన్ పాఠాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈనెల 31న సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నేషనల్ యూనిటీ డే నిర్వహించి, నశా ముక్త భారత్ ప్రతిజ్ఞను విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది అందరూ చేయాలని కలెక్టర్ సూచించారు.

ప్రతి విద్యార్థికి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని, సుమారు జిల్లా స్థాయి కమిటీ నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా, ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ అం బాజీ, డిఆర్డీఓ రవీందర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి నరేందర్, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గణేష్ జాదవ్ పాల్గొన్నారు.