calender_icon.png 9 July, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు పత్తిపంటను ధ్వంసం చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌పై చర్యలు తీసుకోవాలి

09-07-2025 12:52:02 AM

బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

భద్రాద్రి కొత్తగూడెం, జులై 8 (విజయక్రాంతి); పత్తి పంటను ధ్వంసం చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని, రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పాల్వంచ ఫారెస్ట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బండ్రుగొండ గ్రామంలో దంతేల బోర బీట్ ఆఫీసర్.

శారద గత కొద్ది రోజుల నుండి ఏకపక్షంగా వ్యవహరిస్తూ పేద రైతుల పత్తి పంటను ధ్వంసం చేసి, కేసులు పెడతానని బెదిరించి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వారి ఆరోపించారు.ఇప్పటికైనా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తన వైఖరి మార్చుకోవాలని, పోడు సాగు చేసుకుంటున్న పేదరైతుల పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు.

పేద రైతు ఇట్టి రత్నం కు చెందిన రెండున్నర ఎకరాల పత్తి పంటకు సుమారు రూ 1లక్ష నష్టం వాటిల్లిందని,నెల్లెల విశ్వనాథం, మోదుం పరపు సంపూర్ణ, కంటే నాగేంద్రబాబు తదితర రైతుల పత్తి పంటను కూడా గతవారం క్రితం ధ్వంసం చేసి నష్ట పరిచారని పేర్కొన్నారు. బాధిత రైతులకు వెంటనే తగిన నష్టపరిహారం చెల్లించే విధంగా పై అధికారులు చర్యలు తీసుకోవాలనీ సిపిఐ పాల్వంచ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణ చందర్రావు రైతుల పక్షాన డిమాండ్ చేశారు.