23-07-2025 12:53:27 AM
ఘట్ కేసర్, జూలై 22 : నా ప్లాట్ ను కబ్జాకు యత్నిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్లాట్ యజమాని బానోతు లక్ష్మి కోరారు. న్యాయం పరంగా కొనుగోలు చేసిన మాప్లాట్ కు ప్రభుత్వం పరంగా ఇంటి నిర్మాణానికి అనుమతులు తీసుకున్నామని, కరెంటు మీటరు తీసు కోవడంతో పాటు ప్లాటులో ఒక గది నిర్మాణం చేసుకొని ఉంటున్నట్లు ఆ మహిళ విలేకరుల సమావేశంలో తెలిపింది.
సర్వే నెంబర్లు 747, 750 లోని 362 గజాలు నారపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 2022 నవంబర్ 26న రిజిస్టర్ చేయబడిందని, డాక్యుమెంట్ నంబర్ 11422/2022 ప్రకారం నేను కొనుగోలు చేసిన తేదీ నుండి ప్లాట్ నెం. 5/A నిరంతరంగా నాఆధీనంలో ఉన్నదని తెలిపింది.మాప్లాటుకు ప్రహరీ నిర్మిస్తుండగా కొంతమంది దౌర్జన్యంతో మాకు వచ్చి కలవలేదని చెప్తూ మాపనులను ఆటంకం కలిగిస్తూ నామీద తప్పుడు ఫిర్యాదులు .
చేస్తూ కావాలని కాలనీలో కొందరు రవీందర్ రెడ్డి, దయాకర్ రెడ్డి నాకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి కూలి పని చేసుకుని రూపాయి, రూపాయి కూడ పెట్టుకుని కొనుగోలు చేసిన ఆ ప్లాట్ ను నా బిడ్డకు పసుపు కుంకుమ కింద గిఫ్ట్ డిడ్ చేశాను ఆ ప్లాట్ నుకాపాడి నాకు న్యాయం చేయగలరని అధికారులను ఆమహిళ వేడుకున్నారు.