24-11-2025 01:22:56 AM
ఎస్పీ నీతికా పంత్
కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): జిల్లా ఎస్పీ నితికా పంత్ జైనూర్ పోలీస్ స్టేషన్ను ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, హాజరు రిజిస్టర్, స్టేషన్ ను పరిశీలిం చారు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు సిబ్బందీ ఎల్లప్పుడూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
గ్రామాల్లో చట్టవ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత దృష్టి సారించాలని ఆదేశించారు.స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదిదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించా లని, మహిళలుబాలికల భద్రతకు సంబంధించిన కేసులను అత్యంత ప్రాధాన్యంతో చూడాలని సూచించారు.
రాత్రి సమయంలో పికెటింగ్, ప్యాట్రోలింగ్ను నిరంతర ంగా కొనసాగించాలని పేర్కొన్నారు.ప్రజాభద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్, జైనూర్ ఎస్హెచ్‌ఓ రవికుమార్, స్టేషన్ సిబ్బంది తదితరులున్నారు.