24-11-2025 01:28:52 AM
భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్, నవంబర్ 23 (విజయక్రాంతి) : మామడ మండల కేంద్రంలో గంగపుత్ర సంఘ భవన కళ్యాణ మండప (షెడ్) నిర్మాణానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు భూమిపూజ చేసారు. కళ్యాణ మండపం పూర్తి నిర్మాణానికి అదనపు నిధులు త్వరలో మంజూరు చేసి పూర్తి అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకువసంగా సభ్యులు ఎమ్మెల్యే గారికి శాలువాతో సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు బాపు రెడ్డి, నవీన్, గోవర్ధన్ రెడ్డి, రమణ, సూరి, భాస్కర్, వెంకటేశ్వర్ రావ్, శ్రీను, మల్లయ్య, రాజు, ఆశన్న, తో పాటు మండల నాయకులు కార్యకర్తలు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.