24-11-2025 01:21:06 AM
అదనపు కలెక్టర్ డేవిడ్
కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 23(విజయ క్రాంతి): సత్యసాయి సేవలు శాశ్వత స్ఫూర్తిదాయకం అని జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ లో జిల్లా యువజన, క్రీడల విభాగం ఆధ్వర్యంలో ఆదివారం సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు నిర్వ హించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డేవిడ్ సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయిబాబా ప్రజాహితం కోసం చేసిన సేవలు విశ్వవ్యా ప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివైస్‌ఓ అశ్వక్ హుస్సేన్, అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.