24-11-2025 01:27:07 AM
కుంటాల, నవంబర్ 23 (విజయ క్రాంతి) : మండలంలోని కల్లూరు గ్రామంలో రూర్బన్ నిధులతో మంజూరు చేసిన విజ య డైరీ పాలసితిలీకరణ కేంద్రాన్ని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆదివారం ప్రారంభించారు. పాడి రైతులకు ప్రయోజనం కలిగించేందుకు విజయ డైరీ కేంద్రం ఉపయోగపడుతుందని రైతులు ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవాలన్నారు ఈ కార్యక్ర మంలో నందకుమార్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.