24-11-2025 01:30:48 AM
నిర్మల్ నవంబర్ 23(విజయక్రాంతి) : ఆదివారం కలెక్టర్ సమావేశమందిరంలో పుట్టపర్తి సత్యసాయి శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్డీవో రత్నకళ్యాణి, సేవా సమితి సభ్యులు సత్యసాయి చిత్రపటానికి పూలమాలలు వేసి తమ భక్తిని చాటారు. పలువురు మాట్లాడుతూ, సత్యసాయి సమాజానికి ఎన్నో విలువైన సేవలు చేశారని కొనియాడారు.
పేదలకు విద్య, వైద్యం, త్రాగునీరు, వంటి సేవలను అందించారని వివరించారు. సేవ, ప్రేమ, కరుణ వంటి అంశాలతో సమ సమాజ స్థాపన కొరకు పుట్టపర్తి సత్యసాయి పాటుపడ్డారని వివరించారు. ఈ జయంతి వేడుకలలో డివైఎస్‌ఓ శ్రీకాంత్ రెడ్డి, సత్యసాయి సేవా సమితి అధ్యక్షులు భీమ్ సేన్, కన్వీనర్ హరి చరణ్, సభ్యులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.